సావిత్రిబాయి జీవితం ఆదర్శం
సిరిసిల్లటౌన్: ప్రపంచంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సేవలందించిన సావిత్రిబాయిపూలే జీవితం మహిళా లోకానికి ఆదర్శనీయమని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కరుణాల భద్రాచలం, సామాజిక సంఘాల ప్రతినిధులు ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, వంకాయల కార్తీక్ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు ఆధ్వర్యంలో పలువురు నివాళి అర్పించారు. వేముల లక్షయ, కోకన్వీనర్ శ్రీహారిక, పెండెల ఆదిత్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్ర రాకేశ్, మంద అనిల్‌కుమార్, అమృత్‌లాల్ శుక్లా భవనంలో ఐద్వా జిల్లా కార్యదర్శి జువ్వాజి విమల, సూరం పద్మ, సీపీఎం నేతలు ఎగమంటి ఎల్లారెడ్డి, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.


