ఆటోడ్రైవర్ల ఆరోగ్యానికి ధీమా
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): ఆరోగ్య ప్రమాద బీమా.. ఆటో డ్రైవర్ల ఆరోగ్యానికి ధీమాగా ఉంటుందని ఈ పథకాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలోని ఆటోడ్రైవర్లకు ప్రమాదబీమా కార్డులను అందించారు. ఆయా మండల కేంద్రాల్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఆటోడ్రైవర్లకు మనోధైర్యం కల్పించేందుకు బీఆర్‌ఎస్ బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సర్పంచులు అందె సుభాష్, కొండ రమేశ్, నరసింహులు, శరవింద్, తిరుపతినాయక్, తిరుపతి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుళ్లపల్లి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బోయిని రవి, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


