బాధితులకు సత్వర న్యాయం
సిరిసిల్ల క్రైం: బాధితులకు సత్వరన్యాయం ద క్కేలా గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నా రు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 28 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీ స్‌స్టేషన్ల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
వేములవాడఅర్బన్: మైనర్ల డ్రైవింగ్ చట్ట విరుద్ధమని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రజనీదేవి పేర్కొన్నారు. వేములవాడ నందికమాన్ వద్ద ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూ ల్‌లో మోటార్ వాహన నిబంధనలపై సోమవారం అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సహా యక మోటారు వాహనల తనిఖీ అధికారి పృథ్వీరాజ్‌వర్మ తదితరులు ఉన్నారు.
సిరిసిల్లటౌన్: రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో సిరిసిల్లలో పోలీసులు ముందస్తుగా ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ధ్యానపల్లి పరమేశ్‌్, కార్యదర్శి మద్దికుంట లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మల్లారపు పురుషోత్తం మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలపై ప్రశ్నిస్తే స్పందన లేదన్నారు. ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
సిరిసిల్లటౌన్: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర నిర్వీర్యం చేస్తుందని సీపీఐ జిల్లా నాయకుడు గుంటి వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 2005లో ప్రారంభమైన ఈజీఎస్ పథకం ద్వారా దేశంలో 12 కోట్ల మందికి పట్టెడన్నం దొరుకుతుందన్నారు. పేదలకు తిండి పెట్టే పథకాన్ని కాదని ఈజీఎస్ రాంచరణ్ కొత్త పథకాన్ని తీసుకురావడం అన్యాయమన్నారు. రాజు, మల్లేశం, బాలరాజు, చంద్రం, శేఖర్, ఆనందు, బాలయ్య, మల్లయ్య పాల్గొన్నారు.
సిరిసిల్లకల్చరల్: సరిహద్దుల్లో పహారా కాస్తూనే తీరిక సమయాల్లో కవిత్వాలు రాస్తు న్న అక్షర సైనికుడు పెరుక రాజును విశిష్ట కవిరత్న పురస్కారం వరించింది. నవభారత కళాక్షేత్రం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేశారు. అతిథులు మాట్లాడుతూ దేశ రక్షణ విధులు నిర్వహిస్తూనే కవి, రచయితగా రాణించడం గర్వకారణమన్నారు.
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గ్రామాల్లో చిరుత సంచారంతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని శివంగాలపల్లికి చెందిన గొర్లకాపరి బొడ్డు శంకర్‌కు చెందిన గొర్రైపె చిరుత దాడి చేసింది. అది అరవడంతో వదిలిపెట్టి వెళ్లింది.
బాధితులకు సత్వర న్యాయం
బాధితులకు సత్వర న్యాయం
బాధితులకు సత్వర న్యాయం
బాధితులకు సత్వర న్యాయం
బాధితులకు సత్వర న్యాయం


