త్యాగరాజ ఉత్సవాలకు రండి
వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 8 నుంచి 12 వరకు జరిగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు హాజరుకావాలని ఈవో రమాదేవి, అర్చకుల బృందం మంగళవారం అసెంబ్లీలోని చాంబర్‌లో విప్ ఆది శ్రీనివాస్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, నమిలికొండ రాజేశ్వరశర్మ, తమ్మల వెంకన్న ఆశీర్వచనం గావించి ప్రసాదం అందజేశారు.
బాలికలు అన్నిరంగాల్లో ముందుండాలి
సిరిసిల్లఅర్బన్: బాలికలు చదువుతోపాటు, అన్నిరంగాల్లో ముందుండాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. బాల వివాహ ముక్త్ భారత్‌లో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని చంద్రంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. బాలికల రక్షణకు షీ టీంలు, యంగ్ ఇండియా స్కూల్స్, పలు రకాల చట్టాలపై వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌వో ఎస్.రజిత అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గర్భి ణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశాలు అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రగతి సాధించాలని, లేకుంటే నోటీసులు జారీ చేయబడతాయని హెచ్చరించారు. ఆమె వెంట ఎంహెచ్ ఎన్ ప్రోగ్రాం అధికారి నాగేంద్రబాబు, వైద్యాధికారి జీవనజ్యోతి ఉన్నారు.
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
సిరిసిల్లటౌన్: మేడారం జాతరకు సిరిసిల్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల డిపోలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతర నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన సూచనలు, భద్రతా నియమాలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగులకు సదుపాయాలపై వివరించారు. ఆర్టీసీ డిప్యూ టీ రీజినల్ మేనేజర్ భూపతిరెడ్డి, డిపో మేనేజర్ ఎ.ప్రకాష్‌రావు, అన్ని కేటగిరీలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
సిరిసిల్ల: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఏఎంవీఐ బేతి రజని అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్లలోని రెయిన్‌బో, శ్రీకృష్ణవేణి, కాకతీయ హైస్కూళ్లలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరికి వారు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుంటే ప్రమాదాలు జరగవన్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగానే అనే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. రిటైర్డ్ అధ్యాపకులు మద్దికుంట లక్ష్మణ్, పిల్లి ధర్మయ్య జిల్లా రవాణాశాఖ మెంబర్ సంగీతం శ్రీనాథ్, ఏఎంవీఐ పృథ్వీరాజ్‌వర్మ, రవాణా శాఖ సిబ్బంది సౌమ్య, రమ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
త్యాగరాజ ఉత్సవాలకు రండి
త్యాగరాజ ఉత్సవాలకు రండి
త్యాగరాజ ఉత్సవాలకు రండి
త్యాగరాజ ఉత్సవాలకు రండి


