స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

Jan 8 2026 6:27 AM | Updated on Jan 8 2026 6:27 AM

స్పోర

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

సిరిసిల్ల అర్బన్‌: సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్థాపూర్‌లో గల 17వ బెటాలియన్‌లో బుధవారం బెటాలియన్‌ ఇంటర్‌ కంపెనీస్‌ వార్షిక గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను బెటాలియన్‌ కమాండెంట్‌ ఎంఐ. సురేశ్‌ ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది తీరక లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారికి మానసికోల్లాసం కోసం ఈ వార్షిక గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నామన్నారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు జె.రాందాస్‌, ఎస్‌.సురేశ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ప్రమీల, ఆర్‌ఐలు కుమారస్వామి, శ్రీనివాస్‌, శ్యాంరావు, వసంతరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గుడి చెరువులో బోటింగ్‌

వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గుడి చెరువులో బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటుకు రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించాలనే లక్ష్యంతో కొంతకాలంగా ప్రభుత్వాన్ని పలుమార్లు కోరడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో విజ్ఞప్తి చేసినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి త్వరలోనే బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. దీంతో రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పత్యేక కార్యదర్శి జయేష్‌ రంజాన్‌ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ విప్‌ను కలిసిన

వైస్‌ చాన్స్‌లర్‌, రిజిస్టర్‌

వేములవాడ: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను బుధవారం అగ్రహారం జేఎన్టీయూ కళాశాల వై స్‌ చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్టార్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలి శారు. పుష్పగుచ్ఛం అందించి కళాశాలలోని పలు సమస్యలను వివరించారు. త్వరలోనే కళాశాలను సందర్శిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ హామీ ఇచ్చారు.

‘సైన్స్‌కథలు’ పుస్తకం ఆవిష్కరణ

సిరిసిల్లటౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా అమరావతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ బాలసాహితీవేత్త డా.కందేపి రాణీప్రసాద్‌ రచించిన సైన్స్‌కథలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. వచన కవితా సదస్సులో ప్రకాశం జిల్లా రచయితలు తేళ్ల అరుణ, నూనె అంకమ్మ రావు, రామలక్ష్మి, ముద్దు వెంకటలక్ష్మి, పంతుల వెంకటేశ్వర రావులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కలిగించడానికి, సైన్స్‌పై భయం పోవడానికి అనేక రచనలు చేస్తున్న రాణీప్రసాద్‌కు సభాముఖంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

మరిమడ్లలో చిరుత సంచారం

కోనరావుపేట: మండలంలోని మరిమడ్ల అట వీప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం అజ్మీరాతండాకు చెందిన గొర్రెల కాపరి మాలోత్‌ చెన్న గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను హతమార్చడంతో పాటు మరో గొర్రెను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లినట్లు తెలిపారు. సమీప గ్రామస్తులు, గొర్లకాపరులు ఆందోళన చెందుతున్నారు.

తరగతి గదులు దాటి.. ప్రత్యక్ష పాఠాలు

గంభీరావుపేట(సిరిసిల్ల): నిత్యం తరగతి గదుల్లో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినే విద్యార్థులు తరగతి గదులు దాటి ప్రత్యక్ష అవగాహన పాఠాలు నేర్చుకున్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో లైఫ్‌ సైన్స్‌ చదువుకునే విద్యార్థులు బుధవారం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఉద్యాన్‌ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఏకో బజార్‌, ఆధునిక వ్యవసాయ పద్ధతుల పరిచయం, నర్సరీ స్టాల్స్‌, వర్క్‌ షాప్‌ ఏరియా, పట్టు పురుగుల పెంపకం తదితర ప్రదర్శనలను వీక్షించారు. సంబంధిత విభాగాల అధ్యాపకులు వాణి, బిక్షమయ్య, సుచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం1
1/3

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం2
2/3

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం3
3/3

స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement