డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌

Jan 9 2026 7:09 AM | Updated on Jan 9 2026 7:09 AM

డ్రంక

డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలి ● అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ మద్యం విక్రయాలపై ఫిర్యాదు సబ్‌ జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్రం మహిళా లాయర్లకు ముగ్గుల పోటీలు

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల క్రైం: జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 61 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన 55 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

చందుర్తి(వేములవాడ): బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలోని పేర్లను పరిశీలించాలని అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ కోరారు. చందుర్తి తహసీల్దార్‌ ఆఫీస్‌లో రెవెన్యూ అధికారులు, సూపర్‌వైజర్లు, బీఎల్వోలతో గురువారం సమావేశం నిర్వహించారు. అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ మాట్లాడుతూ 2025 జాబితాలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని 2002 జాబితాతో పరిశీలించాలని సూచించారు. అనంతరం మూడపల్లిలోని మినీస్టేడియానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్‌ భూపతి, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, మహేందర్‌, సర్వేయర్‌ చామంతి ఉన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలోని వైన్స్‌షాపు నిర్వా హకులు విచ్చలవిడిగా బెల్ట్‌షాపులకు మద్యం విక్రయిస్తున్నారని జిల్లా ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు ఏఐఎస్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లోని ఆఫీస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయన్నారు. సంబంధిత అధికారులు సైతం బెల్ట్‌షాపుల వైపు చూడడం లేదన్నారు. దేవదాస్‌, సత్తయ్య, ఎల్లయ్య, రాజేశం పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సబ్‌ జూనియర్స్‌ ఎంపిక పోటీలు గురువారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లాలోని 13 మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఎంపికైన 30 మంది క్రీడాకారులను ఈనెల 18న ఆదిలాబాదు జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపించారు. అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గొట్టె రామచంద్రం, జాయింట్‌ సెక్రెటరీ అజయ్‌కుమార్‌, అశోక్‌, సంతోష్‌, కడారి అశోక్‌, ఎఫ్సిబా పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల కడుపు కొడుతూ కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఈనెల 19న సిరిసిల్లలో జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, అన్నల్దాస్‌ గణేశ్‌, బింగి సంపత్‌ పాల్గొన్నారు.

వేములవాడ: బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యోతిర్మయి హాజరయ్యారు.

డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌1
1/2

డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌

డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌2
2/2

డ్రంకెన్‌డ్రైవ్‌పై సీరియస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement