రేషన్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
● అధికారులతో పొలిటికల్ నేతల వాగ్వాదం ● వివాదాస్పదమైన తనిఖీలు.. డీలర్లపై విమర్శలు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రేషన్ షాపుల్లో హై దరాబాద్ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. స్థానిక సివల్ సప్లయ్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. స్టాక్‌రిజిష్టర్లు, పంపిణీపై ఆరా తీశారు. అబ్దుల్ షేక్ రఫీక్, బండారి వేణు, శ్రీనివాస్ తదితర రేషన్ డీలర్ల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలిసి కొందరు షాపులు మూసి వెళ్లిపోయారు.
అధికారులతో వాగ్వాదం
తనిఖీల నేపథ్యంలో పలువురు రేషన్ డీలర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో కేసులు నమోదు చేయడంపై విమర్శలు చేశారు. కమిషనర్ ఆదేశాలతో తనిఖీలు చేపడుతుంటే డీలర్లు రాజకీయనాయకులతో ఒత్తిడి తేవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. చివరికి నాలుగు రేషన్ షాపుల్లో తనిఖీలు చేయగా.. నెహ్రూనగర్‌లోని షాపు నంబరు 3908034లో స్టాక్‌లో తేడాలు గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ టీం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీరాజం తెలిపారు. షాపుడీలర్ అబ్దుల్ షేక్ రఫీక్‌పై కేసు నమోదు చేసి దుకాణాన్ని సమీప డీలర్ గాజుల శ్రీనివాస్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. షాపులో పీడీఎస్ బియ్యం 28 క్వింటాళ్లు, దొడ్డు బియ్యం 50 క్వింటాళ్లు తేడా వచ్చినట్లు వివరించారు. సిరిసిల్ల డీటీసీఎస్ రజిత, వేములవాడ డీటీసీఎస్ సత్యనారాయణ ఉన్నారు.


