బస్సు కోసం మంత్రికి వినతి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకకు బస్సును వేయాలని సర్పంచ్ ఖాతా మల్లేశం రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందించారు. మంత్రిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. గతంలో కరీంనగర్ నుంచి బెజ్జంకి మీదుగా గుండారం, చీలాపురం, రేపాక, ఇల్లంతకుంట మండలానికి నాలుగు ట్రిప్పులు బస్సు నడిచేదని అది కరోనా సమయం నుంచి బంద్ చేశారని పునరుద్ధరించాలని కోరారు. బస్సు పునరుద్ధరిస్తే బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ మంత్రికి విన్నవించుకున్నారు.
వాజ్‌పేయి రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధి
సిరిసిల్లటౌన్: ప్రధానిగా అటల్ బిహార్ వాజ్‌పేయి తన రాజనీతిజ్ఞతతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోనీ పార్టీ ఆఫీస్‌లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సుపరిపాలన సమ్మేళనం నిర్వహించారు. ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, కోల కృష్ణస్వామి, ఆడెపు రవీందర్, సిరికొండ శ్రీనివాస్, బర్కం లక్ష్మి, శీలం రాజు, దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు.
‘వర్కర్ టు ఓనర్’ వర్తింపచేయాలి
సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమలో పనిచేస్తున్న పవర్‌లూమ్, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకం అందించాలని తెలంగాణ రాష్ట్ర పవర్‌లూమ్ కార్మిక సంఘం అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ చేశారు. పవర్‌లూమ్, అనుబంధ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్లలోని చేనేత, జౌళి శాఖ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కోడం రమణ, నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేశ్, ఉడుత రవి, బెజుగం సురేష్, బాస శ్రీధర్, అవదూత హరిదాసు, కందుకూరి రమేశ్ పాల్గొన్నారు.
సర్పంచ్.. ట్రాక్టర్ డ్రైవర్
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని లాల్‌సింగ్‌తండా సర్పంచ్ భూక్య గంగారెడ్డి శుక్రవారం స్వయంగా ట్రాక్టర్ నడిపి రోడ్లను శుభ్రం చేశారు. సర్పంచ్ గంగారెడ్డి మాట్లాడుతూ తండాలోని ప్రజలు తమ ఇంటి వద్ద శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
బస్సు కోసం మంత్రికి వినతి
బస్సు కోసం మంత్రికి వినతి


