జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థి విష్ణువర్ధన్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్ తెలిపారు. హర్యానాలో జరిగిన జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీల్లో విష్ణువర్ధన్ ప్రతిభ చాటాడన్నారు. ఈనెల 13 వరకు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే జాతీయస్థాయి సబ్‌జూనియర్ విభాగంలో తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నట్లు తెలిపారు.
వినియోగదారులకు సమాచారం ఇవ్వండి
వేములవాడఅర్బన్: వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సెస్ అధికారులపై సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలోని రాజశ్రీ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం సెస్ వేములవాడ డివిజన్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, సభ్యులు సత్యనారాయణ, రాజాగౌడ్, ఇన్‌చార్జి డీఈ శ్రీనివాస్, ఏఈలు సిద్ధార్థ, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక


