క్రీడలతో మానసికోల్లాసం
సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్: క్రీడలతో స్నేహభావం పెంపొందడంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. సర్దాపూర్ 17వ బెటాలియన్‌లో శుక్రవారం వార్షిక స్పోర్ట్స్ మీట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ ఉన్న వారందరిని చూస్తే తాను ఐపీఎస్‌గా 2019లో శిక్షణ తీసుకున్న అంశాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఫిట్‌నెస్, క్రమశిక్షణతో ఉత్తమ ప్రతిభ చూపుతామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్, సురేష్, ఆర్‌ఐలు కుమారస్వామి, శ్రీనివాస్, శ్యామ్‌రావు, రాంబ్రహ్మం పాల్గొన్నారు.
చిన్న, సన్నకారు రైతులకు రాజన్న కోడెలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు రాజన్నకు చెందిన 300 కోడెలను ఈనెల 21న ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు ఆధార్‌కార్డు, పట్టాదార్‌పాస్‌బుక్‌లతో https://rajannasiricilla.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రత్యక్ష అనుభవంతో సంపూర్ణ అవగాహన
ప్రత్యక్ష అనుభవంతో సంపూర్ణ అవగాహన వస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. పీఎంశ్రీలో తంగళ్లపల్లి మండలం మండెపల్లి టైడ్స్‌కు ఎక్స్‌పోజర్ విజిట్ కార్యక్రమాన్ని శుక్రవారం గీతానగర్ జెడ్పీ స్కూల్‌లోని 6వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వృద్ధుల డే కేర్ సెంటర్‌లో వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంను కలెక్టర్ ఆదేశించారు. సుభాష్‌నగర్ వృద్ధుల డే కేర్ సెంటర్‌ను పరిశీలించారు. ఫిజియోథెరపి, పాలియేటీవ్ సేవలు అందుబాటులోకి తేవాలని తెలిపారు. తహసీల్దార్ మహేశ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


