ఎములాడలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: మున్సిపల్‌పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలింగేశ్వరగార్డెన్‌లో శుక్రవారం కాంగ్రెస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వేములవాడ మున్సిపల్‌లోని 28 వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరారు. రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు కళ్లలా ముందుకు పోతున్నామన్నారు. వేములవాడను పర్యాటకరంగంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీవల రాజన్న గుడి చెరువులో బోటింగ్ ఏర్పాటుకు రూ.1.40కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నాంపల్లి గుట్టపై రోప్ వే, ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో 42 కులసంఘాలకు సుమారు రూ.6 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కనికరపు రాకేశ్, సాగరం వెంకటస్వామి, కొమురయ్య, చిలుక రమేశ్ ఉన్నారు.


