వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు మాయం
చందుర్తి(వేములవాడ): ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు అపహరించిన సంఘటన చందుర్తి మండలం మర్రిగడ్డలో జరిగిందని ఎస్సై రమేశ్ తెలిపారు. మర్రిగడ్డకు చెందిన కత్తి సులోచన అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుంది. కాగా శనివారం వృద్ధురాలికి స్నానం చేయిస్తుండగా మెడలో పుస్తెలతాడు లేదని గుర్తించారు. అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న తన తల్లి మెడలోంచి పుస్తెలతాడును శుక్రవారం మధ్యాహ్నం అహరించుకుపోయారని కుమారుడు వేణు ఫిర్యాదు చేశారు. ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపినట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు.


