శివాలయంలో ప్రత్యేక పూజలు
సిరిసిల్లటౌన్: సోమనాథ ఆలయంపై వెయ్యేళ్ల క్రితం జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు శనివారం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు నర్సయ్య, దేవరాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేశ్, అధికార ప్రతినిధులు చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, సూరం వినయ్, ఎర్రం విజయ్, సుధాకర్ పాల్గొన్నారు.


