సౌకర్యాలపై దృష్టి సారించాలి
కొండగట్టుకు వచ్చే భక్తులు ఏటా పెరుగుతున్నా.. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలినడకన వెళ్లే భక్తుల కోసం మెట్లదారిని అభివృద్ధి చేసి, లైట్లు ఏర్పాటు చేయాలి, నడిచివెళ్లలేని వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాహనాలు గుడి సమీపంలోకి వెళ్లేందుకు అనుమతించాలి. వైజంక్షన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలి.
– గడ్డం నాగరాజు, గొల్లపల్లె
మంగళ, శనివారాల్లో అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం 200మందికి మాత్రమే ఉచిత అన్నదానం అందిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అంజన్న అన్న ప్రసాదం అందడం లేదు. 400మంది భక్తులకు ఉచిత అన్నదానం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
– చీకట్ల రవీందర్, మ్యాడంపల్లి
సౌకర్యాలపై దృష్టి సారించాలి


