ప్రవాస భారతీయులకు అండగా ప్రభుత్వం
ముస్తాబాద్(సిరిసిల్ల): విదేశాల్లోని భారతీయుల కోసం ప్రభుత్వం మరింత అండగా నిలవాలని ప్రవాసీమిత్ర జనగామ శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్‌లోని టెక్ మహింద్రా ఆడిటోరియంలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌కు హాజరయ్యారు. యూఏఈ, కతార్, సౌదీ, ఒమన్ దేశాల్లో కష్టాల్లో ఉన్న భారతీయులకు సేవలు అందించామన్నారు. ప్రవాసీయులకు తాము అందించిన సేవలను గుర్తించి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్ సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలిశ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ కొండాపురం వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యేను కలిశారు. ఆలయ కమిటీ సభ్యులు కొండాపురం బాల్‌రెడ్డి, మొడుసు నారాయణ, ముత్యాల సత్యంరెడ్డి, బండ సతీశ్‌లు ఉన్నారు.
● ఆలయ ఈవో రమాదేవి
వేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారి నిత్యాన్నదాన సత్రాన్ని ఆలయ ఈవో రమాదేవి శనివారం పరిశీలించారు. అన్నదాన సత్రానికి వచ్చే భక్తులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. పర్యవేక్షకులు పూజిత, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, కూరగాయల శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేములవాడరూరల్: ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందుస్థాన్ అవార్డుకు వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లికి చెందిన వంగపల్లి మణిసాయి ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని ఉలాశనగర్‌లో యంగిస్థాన్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందుస్థాన్’ అవార్డు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత వంగపల్లి మణిసాయివర్మ ఉన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) నుంచి శనివారం ఎల్‌ఎండీకి నీటిని విడుదల చేశారు. సాయంత్రం ఏడు గంటల వరకు ఎల్‌ఎండీకి 250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వంద క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరులో నీటిమట్టం 26.478 టీఎంసీలకు చేరింది.
సిరిసిల్ల క్రైం: జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా కొనసాగుతోందని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీ చేసి నేరప్రవత్తి గల వ్యక్తుల కార్యకలాపాలపై ఆరా తీశారు. నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రవాస భారతీయులకు అండగా ప్రభుత్వం
ప్రవాస భారతీయులకు అండగా ప్రభుత్వం
ప్రవాస భారతీయులకు అండగా ప్రభుత్వం
ప్రవాస భారతీయులకు అండగా ప్రభుత్వం


