ఫిబ్రవరిలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
సిరిసిల్ల: వేములవాడలో ఫిబ్రవరి 18, 19, 20, 21వ తేదీల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు వేములవాడ కాలేజీ మైదానంలో నాలుగు రోజులపాటు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంగీకరించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి అజ్మీరా రాందాస్‌లు ఆది శ్రీనివాస్‌ను కలిసి చర్చించారు. ఈలోగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పోటీల వేదికను రుద్రంగికి మార్చే అవకాశం ఉంది.


