బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

Jan 8 2026 6:27 AM | Updated on Jan 8 2026 6:27 AM

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని, అధికారులంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే సాధ్యమవుతుందని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ‘ఆపరేషన్‌ స్మైల్‌–2026’పై స మీక్ష నిర్వహించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, కార్మిక శా ఖ, పోలీస్‌ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ లు చేయాలని ఆదేశించారు. ఆపరేషన్‌ స్మైల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఆర్డీవో గీత, జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మెన్‌ అంజయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, సీడబ్ల్యూవో కవిత పాల్గొన్నారు.

లూయిస్‌ బ్రెయిలీకి నివాళి

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూ యిస్‌ బ్రెయిలీ జయంతి వేడుకల్లో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పాల్గొన్నారు. దివ్యాంగులతో కలిసి బ్రెయిలీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కేక్‌ కట్‌ చేసి, పంపిణీ చేశారు.

అభ్యంతరాలను పరిష్కరించాలి

సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని ఓటర్ల జాబితా పై వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. 12న వార్డుల వారీగా ఫొటో ఎలక్టరోల్స్‌ జాబితాను ప్రచురించడంతో పాటు, 13వ తేదీన డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల ప్రచురించాలన్నారు.

శివరాత్రిలోగా పనులు పూర్తిచేయాలి

సిరిసిల్లఅర్బన్‌: రానున్న శివరాత్రిలోగా సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడు జంక్షన్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు జంక్షన్‌ వద్ద రూ.3.10 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మున్సిపల్‌ డీవైఈఈ వాణి, ఏఈ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిల్డ్రన్‌ హోం పనులు వేగవంతం చేయాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండెపల్లిలో నిర్మిస్తున్న చిల్డ్రన్‌ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత గడువులోగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. బుధవారం మండెపల్లిలోని ప్రభుత్వ చిల్డ్రన్‌ హోమ్‌, వృద్ధాశ్రమాలను సందర్శించారు. వృద్ధులకు పండ్లు ప ంపిణీ చేశారు. ఆశ్రమంలో వసతులు, భోజనం, ఆ రోగ్య అంశాలపై ఆరా తీశారు. వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాలియేటివ్‌ కేర్‌ వా హన సేవలను వినియోగించుకోవాలని అన్నారు.

త్యాగరాజ ఉత్సవాలకు వృద్ధులను తీసుకెళ్లండి

వేములవాడలో జరిగే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు ఆశ్రమ వృద్ధులను తీసుకువెళ్లాలని జి ల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను కలెక్టర్‌ ఆదేశించారు. సర్పంచులు గదగోని సాగర్‌, గడ్డం రచన చో టు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement