విలీన గ్రామాల్లో ఇష్టారాజ్యం
‘ఇది వేములవాడ మున్సిపాల్టీలోని ఓ వార్డులో ప్రధాన రహదారి పక్కన జరుగుతున్న ఇంటి నిర్మాణం. దీని కోసం మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న యజమాని సర్వేనంబర్ ఒక ప్రాంతంలో చూపించి మరో ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. కాగా, విలీన గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొంత మంది మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగుల సహకారంతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంట లేరనే ఆరోపణలున్నాయి.’


