సద్వినియోగం చేసుకుంటాం
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులకు తోడుగా ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. గ్రామాల్లో లింకురోడ్లు, సిమెంట్ రోడ్లు, మురికి కాల్వలు, ఇతర అన్ని పనుల్లో ఉపాధి హామీ కూలీలను భాగస్వాములను చేస్తూ పనులు చేస్తాం. స్థానిక వనరులను వినియోగించుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీల ఆదాయ వనరులను పెంచుకుంటాం. మా ఊరి అభివృద్ధికి ఉపాధి హామీని, రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
– షేక్ యాస్మిన్‌పాషా,
సర్పంచ్, బావుసాయిపేట


