తెర్లుమద్దికి ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

తెర్లుమద్దికి ఏమైంది?

Jan 6 2026 2:04 PM | Updated on Jan 6 2026 2:04 PM

తెర్ల

తెర్లుమద్దికి ఏమైంది?

● పక్షం రోజుల్లో పది మంది మృతి ● ‘తెర్లు’ అవుతున్న కుటుంబాలు ● భయాందోళనలో గ్రామస్తులు ● వ్యాధులే కారణమా? ● మరణాలపై అన్వేషణ

గ్రామ వివరాలు

వ్యాధులతోనే మరణాలు

ధైర్యం చెబుతున్నాం

● పక్షం రోజుల్లో పది మంది మృతి ● ‘తెర్లు’ అవుతున్న కుటుంబాలు ● భయాందోళనలో గ్రామస్తులు ● వ్యాధులే కారణమా? ● మరణాలపై అన్వేషణ

ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతులు ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్దికి చెందిన దాదగారి అంజవ్వ, నర్సయ్య. మరణించిన భర్త రమేశ్‌ ఫొటోతో ఉన్నది బాల్‌లక్ష్మి. వృద్ధ దంపతుల కుమారుడు దాదగారి రమేశ్‌(45) పక్షవాతంతో మృతిచెందాడు. రమేశ్‌ తల్లిదండ్రులు అంజవ్వ, నర్సయ్య కూడా పక్షవాతంతో మంచం పట్టారు. వ్యవసాయ పనులు చేసుకునే రమేశ్‌ పలు వ్యాపారాలు సైతం నిర్వహించి నష్టపోయాడు. తీవ్ర మనోవేదన, టెన్షన్‌తో పెరాలసిస్‌కు గురయ్యాడు. చికిత్స కోసం ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.5లక్షలు అప్పులు చేసినా ప్రాణం దక్కలేదు. కొడుకు పోయిన దుఖంలో నెలరోజుల వ్యవధిలో వృద్ధ దంపతులకు పక్షవాతం వచ్చింది. ఇప్పుడు వారికి చికిత్స చేయించే స్థోమత లేని కోడలు బాల్‌లక్ష్మి బీపీ టాబ్లెట్లతోనే అత్తామామలను పోషిస్తోంది. బాల్‌లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. వీరిని ఎలా పోషించేదని, పెరాలసిస్‌తో ఉన్న అత్తామామలను ఎలా కనిపెట్టుకునేదని ఆవేదన చెందుతోంది. పెరాలసిస్‌ తమ జీవితాలను తలకిందులు చేసిందని రోదిస్తోంది.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వరుస మరణాలతో ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్ది వణికిపోతుంది. ఎప్పుడు.. ఎవరూ మరణిస్తున్నారో తెలియక గ్రా మీణులు భయాందోళన చెందుతున్నారు. మరణా లకు కారణాలకు బహిరంగంగా తెలుస్తున్నా ఎన్న డూ లేని విధంగా పదిహేను రోజుల్లోనే పది మంది ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం కారణాలు పైకి కనిపిస్తున్నా మరణాల సంఖ్య అధికంగా ఉండడమే వారి భయాందోళనకు కారణం.

ఉసురుతీస్తున్న పెరాలసిస్‌

తెర్లుమద్దిలో పెరాలసిస్‌తో బాధపడుతున్న వారు పక్షం రోజుల్లో ముగ్గురు మృతిచెందారు. గ్రామానికి చెందిన చెక్కపల్లి లక్ష్మి, ఉల్లి కొమురవ్వ, మామిండ్ల వెంకవ్వ పక్షవాతంతో బాధపడుతూ మృతిచెందారు. వీరంతా కొన్నేళ్లుగా పక్షవాతంతోనే బాధపడుతున్నారు. అయితే వరుసగా చనిపోతుండడంపై ఆందోళన నెలకొంది. కాలేయ వ్యాధితో ఈర్ల బాబు(38) మృతిచెందగా, కొమ్మెట రమేశ్‌(33) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదునూరి మల్లవ్వ(72) గుండెపోటుతో, చలి తీవ్రతతో పుట్ట నారాయణ(75) మృతిచెందాడు. నారాయణ ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే అంత్యక్రియలు నిర్వహించారు. పుట్ట రమేశ్‌ ఆత్మహత్య చేసుకోగా, మామిండ్ల రామస్వామి గొంతు క్యాన్సర్‌, బైతి రాజయ్య విద్యుదాఘాతంతో చనిపోయారు. వెగ్గళం లక్ష్మీనారాయణ(82), దానవేని పెద్ద మల్లయ్య(81) వృద్ధాప్య సమస్యలతో మృతిచెందారు. బైతి లక్ష్మి(90) చలిని తట్టుకోలేక మృతిచెందింది. రెండు నెలల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని సర్పంచ్‌ బైతి దుర్గవ్వ ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాధులతోనే మరణాలా..?!

తెర్లుమద్ది వ్యవసాయ ఆధారిత గ్రామం. మానేరు ప్రాజెక్టు పరివాహక పరిధిలో ఉంటుంది. ఒక పక్క అందమైన గుట్టలు. మరోపక్క నక్కవాగు ప్రవాహతో ఊరు పచ్చగా కళకళలాడుతుంటుంది. వరి ప్రధానంగా సాగుచేస్తున్నారు. గ్రామంలో 2007లో పంచాయతీలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంటు ద్వారా తాగునీరు తీసుకెళ్తున్నారు. మిషన్‌ భగీరథ నీరు నాలుగురోజులకోసారి కూడా రావడం లేదు. ఎవరైన మరణిస్తే పది రోజుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందుతున్నాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఓ కుటుంబంలో పెద్ద దికై ్కన నలుగురు పురుషులు పదేళ్లలో మృత్యువాత పడ్డారు. గ్రామంలో రకరకాల కారణాలతోనే వరుస మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

జనాభా: 1596 (2011 లెక్కలు)

పురుషులు: 807, మహిళలు: 789

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు

పెరాలసిస్‌ : 06, క్యాన్సర్‌: 03

గ్రామంలో పలు రకాల వ్యాధులతోనే మరణాలు సంభవిస్తున్నాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. చలి, గుండెపోటు, పెరాలసిస్‌తోనే మరణాలు సంభిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తాం. – డాక్టర్‌ రాజ్‌కుమార్‌,

పల్లెదవాఖాన, వైద్యాధికారి

రోజుల వ్యవధిలోనే పలువురు మృతిచెందడం బాధాకరం. వారి మరణం కుటుంబాలలో తీవ్ర విషాదం మిగిల్చింది. వరుస మరణాలతో ప్రజలు భయపడుతున్నారు. మేము వ్యాధిగ్రస్తులను గుర్తించి ధైర్యం చెబుతున్నాం. మంచి వైద్యం కోసం అవగాహన కల్పిస్తున్నాం. వైద్యశాఖ దీనిని సీరియస్‌గా తీసుకుని కారణాలను అన్వేషించాలి.

– బైతి దుర్గవ్వ, సర్పంచ్‌, తెర్లుమద్ది

తెర్లుమద్దికి ఏమైంది?1
1/3

తెర్లుమద్దికి ఏమైంది?

తెర్లుమద్దికి ఏమైంది?2
2/3

తెర్లుమద్దికి ఏమైంది?

తెర్లుమద్దికి ఏమైంది?3
3/3

తెర్లుమద్దికి ఏమైంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement