రబీకి నీటిని విడుదల చేయాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి రబీ పంటలకు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్ ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి మట్టాలు, ప్రణాళికపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ముందుగా ఎగువ, మిడ్‌మానేరు ప్రాజెక్టులు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్‌లలో నీటిమట్టం వివరాలపై ఆరా తీశారు. మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరులో 1.8 టీఎంసీలు, అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 3.30 టీఎంసీలు, మిడ్‌మానేరులో 26.65 టీఎంసీల నీరు నిలువ ఉందని నీటిపారుదల అధికారులు వివరించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, నీటి పారుదల శాఖ అధికారులు కిశోర్‌కుమార్, జగన్, సంత్‌ప్రకాశ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
కులాంతర పెళ్లికి ప్రోత్సాహక బాండ్ పంపిణీ
కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.2.50 లక్షల ప్రోత్సాహక బాండ్‌ను కలెక్టర్ అందజేశారు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన జక్కుల జిల్లాలో మొత్తం 180 దరఖాస్తులు రాగా.. 57 మందికి రూ.1.42 కోట్లు పంపిణీ చేశామని, మరో 11 మందికి త్వరలో ఇస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు.


