చిన్నారి వైద్యానికి సాయం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి వైద్యానికి సాయం

Jan 5 2026 11:38 AM | Updated on Jan 5 2026 11:38 AM

చిన్న

చిన్నారి వైద్యానికి సాయం

చిన్నారి వైద్యానికి సాయం లూజ్‌వైర్ల సమస్య పరిష్కరిస్తా హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను అడ్డుకుందాం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌కు చెందిన సూర వైష్ణిక వైద్యానికి పలువురు దాతలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ‘సాక్షి’లో ఆదివారం ‘చిన్నారికి ‘ఊపిరి’ పోయండి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. గూడెం గ్రామానికి చెందిన పారిశ్రామివేత్త చిట్నేని వెంకేటశ్వర్‌రావు రూ.10వేలు అందించారు. మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు స్పందించి వైష్ణిక తండ్రి రాజశేఖర్‌తో మాట్లాడారు. సిద్దిపేటలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులతో చర్చించారు. వైష్ణికకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సుతో మాట్లాడారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి బాధిత బాలికకు అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఖర్చు కోసం భయపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ కో కన్వీనర్‌ కనమేని చక్రధర్‌రెడ్డి చిన్నారికి వైద్యం అందేలా ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని పొత్తూరులో లూజ్‌ విద్యుత్‌ తీగల సమస్యను పరిష్కరిస్తామని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు పేర్కొన్నారు. పొత్తూరులో విద్యుత్‌ పోల్స్‌ పరిస్థితి పరిశీలించిన తర్వాత మాట్లాడారు. గ్రామంలో మెయిన్‌ రోడ్డు వెంబడి ఉన్నటువంటి పోల్స్‌ సమస్యను కూడా సత్వరమే పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎన్నికై న గ్రామ సర్పంచ్‌ పట్నం అశ్విని, పాలకవర్గ సభ్యులు చిక్కాల రామారావును, సెస్‌ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డిని సన్మానించారు. మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, సిద్ధం శ్రీనివాస్‌, తోడేటి సతీశ్‌, పావని, మహేందర్‌, సాగర్‌, గుంటి మధు, కట్ట సాయి, కిరణ్‌, భీరయ్య పాల్గొన్నారు.

కోనరావుపేట(వేములవాడ): ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీని అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విమర్శించారు. మండలంలోని నిజామాబా ద్‌కు చెందిన ఎన్నారై సింగం ప్రసాద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎదురుగట్ల అంజయ్యలతోపాటు వందమంది ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మండలంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలన్నారు. సెస్‌ వైస్‌చైర్మన్‌ తిరుపతి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌ రాంమోహన్‌రావు, సర్పంచులు కుంటెల్లి నాగరాజు, మల్యాల స్వామిదాసు, వంశీకృష్ణా రావు, వంగపెల్లి శ్రీనివాస్‌, శివతేజ, మంతెన సంతోష్‌, రాజిరెడ్డి, భూంరెడ్డి పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు కోరారు. మండలంలోని బందనకల్‌లో ఉపాధిహమీ కూలీలతో ఆదివారం మాట్లాడారు. పల్లెల్లో పనులు కరువైన భూములు లేని నిరుపేదలే ఉపాధిహామీలో ఉపాధి పొందుతున్నారన్నారు. పేదలకు అన్నం పెడుతున్న ఈజీఎస్‌ చట్టాన్ని కేంద్రం రద్దు చేసే యోచనలో ఉందన్నారు. రాంరెడ్డి, తిరుపతి, బాలయ్య, గోపాల్‌, రమేశ్‌, రాజేందర్‌, అశోక్‌, నవీన్‌, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, కనకయ్య పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో ప్రతిభ

తంగళ్లపల్లి: మండలంలోని జిల్లెల్లకు చెందిన బర్ల సాయి ప్రభంజన్‌ నేషనల్‌ ఓపెన్‌ కరాటే పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఆదివారం వరంగల్‌లో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొని గెలుపొందాడు. సాయి ప్రభంజన్‌ జిల్లెల్లలోని విజ్ఞాన్‌ విద్యానికేతన్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.

చిన్నారి వైద్యానికి సాయం
1
1/4

చిన్నారి వైద్యానికి సాయం

చిన్నారి వైద్యానికి సాయం
2
2/4

చిన్నారి వైద్యానికి సాయం

చిన్నారి వైద్యానికి సాయం
3
3/4

చిన్నారి వైద్యానికి సాయం

చిన్నారి వైద్యానికి సాయం
4
4/4

చిన్నారి వైద్యానికి సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement