జిల్లా జడ్జికి శుభాకాంక్షలు
సిరిసిల్లటౌన్: జిల్లా జడ్జి పి.నీరజను శనివారం లోక్‌అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్ కలి శారు. జడ్జికి పుష్పగుచ్ఛం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
వేములవాడ: పర్యావరణాన్ని కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ కోరారు. వేములవాడ కోర్టు ఆవరణలో శనివారం మొక్కలు నాటి మాట్లాడారు. కోర్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెట్లను నరికివేస్తే మన ఉనికికే ప్రమాదమన్నారు.
సిరిసిల్లటౌన్: అసెంబ్లీలో సిరిసిల్ల పవర్‌లూమ్ వస్త్రపరిశ్రమ సమస్యలను ప్రస్తావించాలని సీపీఐ నేతలు ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు విన్నవించారు. హైదరాబాద్‌లో శనివారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ యజమానుల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వలేదన్నారు. వర్కర్స్ టు ఓనర్ పథకాన్ని అమలుచేయడం లేదన్నారు. యారన్‌డిపోలో నెల రోజులుగా యారన్ నిల్వలు లేవన్నారు. పై సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని కోరారు. నాయకులు పంతం రవి, సోమ నాగరాజు, గాజుల లింగం, రాయమల్లు, మండల వెంకటేశ్ ఉన్నారు.
సిరిసిల్లకల్చరల్: దేశవ్యాప్తంగా నిషేధించిన చైనా మాంజాను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఖాధిర్‌పాషా హెచ్చరించారు. సిటిజెన్స్ ఎంపవర్‌మెంట్ త్రు అవేర్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి, సంస్థ ప్రతినిధి ఆడెపు వేణుతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాంజా నిషేధంపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను పురపాలక సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నిషేధిత సింథటిక్, మాంజా క్రయ విక్రయాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ ప్రతినిధులు ఆడెపు ఆంజనేయులు, యేముల రామ్ సాహుల్, పత్తిపాక ముక్తేశ్వర్, గుండేటి కృష్ణహరి, ఆర్‌పీ విక్రమ్ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరుగవని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇల్లంతకుంట హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల సమావేశంలో మాట్లాడారు. పాఠశాల స్థాయి విద్యార్థులు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. హైస్కూల్ హెచ్‌ఎం ప్రేమలత, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ పాల్గొన్నారు.
జిల్లా జడ్జికి శుభాకాంక్షలు
జిల్లా జడ్జికి శుభాకాంక్షలు
జిల్లా జడ్జికి శుభాకాంక్షలు
జిల్లా జడ్జికి శుభాకాంక్షలు


