
రోడ్డు విస్తరణ పూర్తిచేస్తాం
వేములవాడ: మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు గల రోడ్డు విస్తరణకు భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులను మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడలో 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతోపాటు 350 కు టుంబాలకు నష్టపరిహారం కింద గజానికి రూ.30వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, 50 ఏళ్లుగా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు అందుతాయని హెచ్చరించారు. నలుగురు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, మిగతావి సరైనవి కావని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రాధాబాయి స్పష్టం చేశారు. అధికారులకు సహకరించాలని కోరారు. మున్సిపల్ మేనేజర్ సంపత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
భూయజమానుల ఆందోళన
అధికారులు పరిశీలిస్తుండగానే.. ఆయా భవనాల యజమానులు ఆలయం ఎదుట ఆందోళన చేశారు. తమకు సరైన నష్టపరిహారం అందించాలని, ఇంకాస్త సమయం ఇవ్వాలని వారు కోరారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకోగా.. పోలీసుల సహాయంతో కొలతలు పూర్తి చేశారు.
భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
రుద్రంగి(వేమలవాడ): భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. రుద్రంగి, మానాలలో నిర్వహించిన సదస్సుకు హాజరై మాట్లాడారు. వివిధ కారణాలతో రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇవ్వని వారు తర్వాత అధికారులకు అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే అధికారులకు రైతులు స హకరించాలని కోరారు. మానాలలోని కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రితో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వేములవాడ మెయిన్‌రోడ్డు పరిశీలన