వేములవాఅర్బన్/వేములవాడరూరల్: ఇంది రమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో దళారులను నమ్మొద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. విడతల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. వేములవాడ అర్బన్ మండలానికి 370 లబ్ధిదారులకు, వేములవాడరూరల్ మండలం చెక్కపల్లిలో మంగళవారం 333 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి అందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. వేములవాడరూరల్ మండలం వెంకటాంపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అధికారులు నిర్మాణాలను పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి కోసం ఉచితంగా ఇసుకా అందిస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, హౌసింగ్‌పీడీ శంకర్, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీరాజం, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అబూబాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
వేములవాడ: నియోజకవర్గానికి రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, ఉపాధ్యాయులకూ వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన ఉంటుందని తెలిపారు.
ఎన్నికల హామీ నెరవేరుస్తున్నాం
ప్రభుత్వ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


