
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ
● బోధనలో మార్పులు అవసరం ● జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు
సిరిసిల్లఎడ్యుకేషన్: మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విధానంలో బోధన చేయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్లలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, కరీంనగర్ డైట్ కళాశాల బోధకులు, స్టేట్ రిసోర్సు పర్సన్లు సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బోధన మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో భాగంగా సాంఘికశాస్త ఉపాధ్యాయులకు మోటివేషన్ తరగతులను శ్రీనివాస్, బోధించారు. కోర్సు కోఆర్డినేటర్ శైలజ, కోర్సు ఇన్‌చార్జీలు శారద, పద్మ, వెంకటేశ్వర్‌రావు, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, జిల్లా రిపోర్సు పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.