
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
సిరిసిల్లటౌన్: రోడ్డు భద్రత నియమాలు పాటించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో శుక్రవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇన్సూరెన్స్ గురించి వివరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని, సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేసినా శిక్షార్హమేనన్నారు. లైసెన్సు లేని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, ఆటోడ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ కనకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్
ఆటోడ్రైవర్లకు అవగాహన