
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● ముందు జాగ్రత్తలు మేలు ● మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షించారు. రా నున్న వానాకాలంలో ప్రతీ గ్రామంలో, ప్రతీ ము న్సిపల్ వార్డుల్లోనూ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వను తొలగించాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయించాలన్నారు.
లోతట్టు ప్రాంతాలపై శ్రద్ధ
జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, దోమల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామసభలు పెట్టి అవగాహన కల్పించాలన్నారు. అన్ని పీహెచ్‌సీలలో డెంగీ రాపిడ్ టెస్ట్‌లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను తొలగించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో ఎస్.రజిత, డీపీవో షరీఫొద్దీన్, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.