
కొత్త చట్టాల ప్రకారమే కేసులు
సిరిసిల్లకల్చరల్: నూతన చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో శనివారం ద్వైమాిషిక పర్యవేక్షణ సమీక్ష నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మానిటరింగ్, మెంటరింగ్ కమిటీ సభ్యులు, ప్యా నెల్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. కొత్త చట్టాలతో నవీకరించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అగ్రి లీగల్, ఎయిడ్, పారలీగల్ వలంటీర్లు, లా విద్యార్థుల పనితీ రును ప్రశంసించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, మానిటరింగ్ సభ్యుడు జి.అంజయ్య, లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, జి.అంజనేయులు పాల్గొన్నారు.