
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆదివారం సిరిసిల్ల లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో మల్లికార్జునస్వామి ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, జగదాంబతండా, రాచర్లగొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకానున్నారు.
హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల: కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి కోరారు. సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్‌లో శనివారం సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్‌యాదవ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వైశాలి ఉన్నారు.
వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్ల: వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లును కోరారు. ఆర్డీవో ఆఫీస్‌లో శనివారం కలిసి విన్నవించారు. వయోవృద్ధులను వారి కొడుకులు పోషించకుండా.. ఆకలి బాధతో మాడ్చుతున్నారన్నారు. ఇటీవల ఆర్డీవోగా విధుల్లో చేరిన వెంకటేశ్వర్లును సీనియర్ సిటిజెన్స్ సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, రాష్ట్ర ఈసీ మెంబర్ శ్రీగాథ మైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
వేములవాడ సబ్‌కోర్టు ఇన్‌చార్జి పీపీగా రాజిరెడ్డి
వేములవాడ: వేములవాడ సబ్‌కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గౌరు రాజి రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శని వారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పీపీగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని వేములవాడ ఇన్‌చార్జీగా నియమించారు. ఇక్కడ గురు, శుక్రవారాల్లో సేవలందిస్తారు.
ఉగ్రవాదులను అంతం చేయాలి
వేములవాడ: మన ఆడబిడ్డల సింధూరాలను తుడిచిన ఉగ్రవాదులను అంతం చేయాలని ఫోజీ ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు పద్మలత, జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్ కోరారు. వేములవాడలో శనివారం తిరంగ్‌యాత్ర నిర్వహించారు. వైద్యులు స్రవంతి, స్వప్న, చీకోటి సంతోష్, అభినయ్, కోటగిరి మనోహర్, అనిల్‌కుమార్, తిరుపతి, ఆనందరెడ్డి, మహేందర్, సింధు, నాగేందర్, సుమన్, లహరి, సంతోష్‌చారి, సంధ్యారాణి, రాజేందర్, లీలాశిరీష, గీతావాణి. త్రిసంధ్య పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అక్కపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రి శనివారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, ట్యాబ్‌లో ఎంత వరకు ఎంట్రీ చేశారని ఆరా తీశారు. ఇన్‌చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ రమణ, వీవోఏ రమ తదితరులు ఉన్నారు.

నేడు సిరిసిల్లకు కేటీఆర్

నేడు సిరిసిల్లకు కేటీఆర్

నేడు సిరిసిల్లకు కేటీఆర్

నేడు సిరిసిల్లకు కేటీఆర్

నేడు సిరిసిల్లకు కేటీఆర్