5 బస్తాలు కోత విధించారు
నేను 8 ఎకరాల్లో వరి సాగు చేసిన. దాదాపు 326 బస్తాల ధాన్యం వచ్చింది. తూకం వేసి రైస్‌మిల్లుకు పంపిన తర్వాత 5 బస్తాలను కట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెయిట్ లాస్ వచ్చిందని కట్ చేశారని బదులిచ్చారు. నాకు రూ.5వేలు నష్టం వచ్చింది.
– మర్రి శంకర్, చందుర్తి
వెయిట్ లాస్ వస్తోందని..
తూకం వేసిన తర్వాత రెండు రోజులు లారీలు ఆలస్యంగా వస్తే మిల్లర్లు తూకంలో వెయిట్ లాస్ వస్తోందని కోతలు విధిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతులు మాత్రం మేమే ధాన్యం కట్ చేస్తున్నామని దూషిస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కటింగ్‌కు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు.
– రజిత, ఐకేపీ ఏపీఎం, చందుర్తి
●


