
నిండా ముంచుతున్నారు !
● ఇప్పటికే 530కి పైగా బస్తాల కోత ● రూ.5లక్షలకు పైగా రైతుల సొమ్ము స్వాహా ● ఒక్కో రైతు నుంచి 2 నుంచి 10 బస్తాల వరకు కటింగ్ ● అధికారులే న్యాయం చేయాలంటున్న రైతులు
చందుర్తి(వేములవాడ): రైతులను ప్రకృతి ప్రకోపాలు నిండా ముంచడం చూశాం. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు తెలియకుండానే ని లువు దోపిడీ చేస్తున్నారు. అధికారులు, పాలకులు ఒక్కటై అన్నదాతలను ఆగం చేస్తున్నారు. చందుర్తి మండల పరిధిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి దాదాపు 530కి పైగానే బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు లోలోపల కుమిలిపోతున్నారు. రైతులను నిండా ముంచుతున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్.
20 కేంద్రాలు.. రూ.4.95 లక్షలు స్వాహా
చందుర్తి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 13, సనుగుల సింగిల్‌విండో ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని 13 కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.20 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 314 బస్తాలు కోత పెట్టారు. ఐదు రోజుల లెక్కలు అందుబాటులో లేవు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 70 బస్తాల వరకు కోత విధించి ఉంటారన్న అంచనా. సనుగుల సింగిల్‌విండో పరిధిలో 56 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. రైతుల నుంచి 225 బస్తాల వరకు కటింగ్ చేశారు. ఐకేపీ, సింగిల్‌విండోల ద్వారా మొత్తానికి 539 బస్తాలు కోత విధించగా.. వీటి విలువ దాదాపు రూ.4.95 లక్షల వరకు ఉంటుంది. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన సొమ్మును రైస్‌మిల్లర్లు దోచుకోవడంపై అన్నదాతల నుంచి విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల మూసివేసే వరకు రైతులకు చెందాల్సిన సుమారు రూ.20లక్షల సొమ్ము వరకు రైస్‌మిల్లర్ల జేబుల్లో చేరుతాయనే ఆరోపణలు రైతులు చేస్తున్నారు. గతంలో తూకంలో బస్తాకు కిలో అదనంగా వేయడంతో ఇలా కోత విధించలేదని.. ఈసారి అదనపు కిలో తూకం లేకపోవడంతో మిల్లర్లు తమ దోపిడీకి ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మిల్లర్లు చెప్పిందే వేదం
రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మిల్లర్ల దోపిడీ ఆగడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గన్నీసంచులు పంపించగా.. వాటిని రైస్‌మిల్లర్లు దించుకోకపోవడంతో చాలా కేంద్రాల్లో కొత్త వాటిని పక్కకు పెట్టి పాత గన్నీసంచుల్లో తూకం వేస్తున్నట్లు తెలిసింది. ఇలా పాత గన్నీసంచుల్లోనే తూకం వేస్తేనే మిల్లర్లు ధాన్యాన్ని అన్‌లోడ్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. పాత గన్నీ సంచుల్లోనే తూకం వేసుకోవాలన్న మిల్లర్ల ఆలోచన వెనుక వెనుక ఏం ఆంతర్యం తెలియడం లేదు.
ఇతను చందుర్తికి చెందిన పోతురాజు మోహన్. 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చందుర్తిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 904 ధాన్యం బస్తాలను విక్రయించాడు. లారీలో తరలించిన 904 బస్తాల నుంచి 10 బస్తాలను కట్ చేస్తున్నామని నిర్వాహకులు చెప్పగా.. తమ ధాన్యం బస్తాలను వాపస్ తెప్పించి ఇవ్వాలని రైతు మొండికేశాడు. ఎవరికై నా చెప్పుకోమనడంతో చేసేదేమి లేక సైలెంట్ అయ్యాడు. 10 బస్తాల కటింగ్‌తో 4 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ. 10వేల వరకు నష్టం వచ్చిందని వాపోయాడు.
చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన రైతు ఏరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 626 బస్తాలను 20 రోజుల క్రితం తూకం వేసి అపెరల్ పార్క్‌కు తరలించారు. అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసి అధికారులు 5 బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకున్నా ఎలాంటి లాభం లేకపోవడంతో ఈనెల 14వ తేదీ రాత్రి వివరాలు ఇచ్చి, ఓటీపీ చెప్పాడు.

నిండా ముంచుతున్నారు !

నిండా ముంచుతున్నారు !

నిండా ముంచుతున్నారు !