నిలిచిన మైనర్ వివాహం
● తల్లిదండ్రులకు అధికారుల కౌన్సిలింగ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గుట్టుచప్పుడు కాకుండా మైనర్ బాలిక వివాహం చేస్తున్నట్లు తె లుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని అ డ్డుకున్నారు. మైనర్ వివాహంపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అధికారులు తెలిపిన వివరాలు. మండలంలోని నారాయణపూర్‌లో శుక్రవారం మైనర్ బాలిక(17) వివాహం చేస్తుండగా.. సమాచారం అందడంతో ఐసీడీఎస్, సఖీ కేంద్రం, రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకొని అడ్డుకున్నారు. సీడీపీవో ఉమారాణి, తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ.. మైనర్ వివాహాలు చట్టరీత్య నేరమన్నారు. మైనార్టీ తీరిన తర్వాతనే వారి ఇష్టానుసారంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. చైల్డ్‌లైన్ అధికారులు విజయలక్ష్మి, సూపర్‌వైజర్ శ్రావణ్, ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్, లీగల్ ప్రొటెక్షన్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు కరీంనగర్ పార్లమెంట్ కోకన్వీనర్ ఆడెపు రవీందర్ కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. మండల అధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
నిలిచిన మైనర్ వివాహం


