సమన్వయంతో ఆపరేషన్ స్మైల్
సిరిసిల్లక్రైం: చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని, సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ మహేశ్ బీ గితేతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జనవరి 1 నుంచి 31 వ రకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని సమన్వయంతో అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎ క్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సమీప పోలీస్‌స్టేషన్‌కు స మాచారం అందించాలని ప్రజలను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబ డి ఉందన్నారు. ఆ పరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఏఎస్పీ చంద్ర య్య ఆధ్వర్యంలో అమలు చేస్తామని తెలి పారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అంజయ్య పాల్గొన్నారు.
డీఆర్‌డీవో శేషాద్రి బదిలీ
సిరిసిల్ల: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి బదిలీ అయ్యారు. ఐదు రోజుల క్రితం ఆయనను మాతృసంస్థలో చేరాలని మౌఖిక ఆదేశాలు రావడంతో హైదరాబాద్ వెళ్లి జాయిన్ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో జెడ్పీ సీఈవో హోదాలో ఉన్న శేషాద్రి హైదరాబాద్ పీఆర్ శాఖకు వెళ్లినట్లు సమాచారం. జిల్లా డీఆర్‌డీవోగా 2023 ఫిబ్రవరి 14న విధుల్లో చేరారు. జిల్లాలో ఇప్పటికే జిల్లాస్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు కీలక శాఖలకు ఇన్‌చార్జి అధికారులు ఉన్నారు. తాజాగా డీఆర్‌డీవో బదిలీ కావడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. జెడ్పీ డిప్యూటీ సీఈవోగా ఉన్న మచ్చ గీతకు ఇన్‌చార్జి డీఆర్‌డీవోగా నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ వాటిపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తామని మాటిచ్చి తప్పిందన్నారు. బెల్ట్ షాపులకు మద్యం రవాణా చేస్తున్న వైన్స్‌లపై చర్యలు తీసుకోకుంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భామనుల రవీందర్, అనసూర్య, సంగీత, త్రివేణి, దేవదాసు, సుజాత, లత తదితరులున్నారు.
సమన్వయంతో ఆపరేషన్ స్మైల్
సమన్వయంతో ఆపరేషన్ స్మైల్


