మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..?
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
వేములవాడఅర్బన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరుపట్టిక, స్టోర్ రూమ్‌లో ఆహార సామగ్రి, కోడిగుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడిగుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రణాళికతో ముందుకెళ్లి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.


