విన్నపాలు వినవలే..
● ప్రజావాణిలో వెల్లువెత్తిన వినతులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 120 విన్నపాలు
సిరిసిల్లటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీ సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వినతిపత్రాలు స్వీకరించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 54, మున్సిపల్ 11, డీఆర్‌డీవో 7, ఉపాఽధికల్పన 6, హౌసింగ్ 5, ఎస్‌డీసీ 4, డీడబ్ల్యూవో 3, ఎస్సీ కార్పొరేషన్, ఏడీఎస్ అండ్ ఆర్‌డీఎస్‌వో, హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్, డీఎంహెచ్‌వోకు రెండు చొప్పున మొత్తంగా 120 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తదితరులు పాల్గొన్నారు.


