
ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి
● తపస్ జిల్లా అధ్యక్షుడు గశికంటి శ్రీనివాస్
బోయినపల్లి(చొప్పదండి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు గశికంటి శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోపు పెండింగ్ డీఏలు, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సీఎం చేతులెత్తేయడం సరికాదన్నారు. రాష్ట్ర కార్యదర్శులు ఒడ్నాల జగన్‌మోహన్, కటుకం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకృష్ణారెడ్డి ఉన్నారు.