గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ సభ్యులు | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ సభ్యులు

May 9 2025 1:11 AM | Updated on May 9 2025 1:11 AM

గవర్న

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ సభ్యులు

సిరిసిల్లటౌన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ సభ్యులు గురువారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మను కలిశారు. తనె 8న ప్రపంచ రెడ్‌క్రాస్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ రాజభవన్‌లో జరిగిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వ్యవస్థాపకులు హేండ్రి డునంట్‌ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. కాగా, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రం కోసం విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వేములవాడ మండలం తిప్పాపూర్‌లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని అందించారు. సదరు స్థలంలో సొసైటీ భవన నిర్మాణం కోసం జరిగే భూపూజకు హాజరు కావాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు, జిల్లా కమిటీ అడ్వైజర్‌ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, స్టేట్‌ కమిటీ సభ్యులు ప్రయాకర్‌రావు, వేణు కుమార్‌ పాల్గొన్నారు.

పాఠశాల కమిటీలకు బిల్లుల చెల్లింపు

సిరిసిల్ల: జిల్లాలోని 283 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల కమిటీలకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా బిల్లులు చెల్లించారని డీఆర్‌డీవో శేషాద్రి గురువారం తెలిపారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాటశాల కమిటీల ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఆయా కమిటీలకు చెల్లించడం జరిగిందని వివరించారు.

అసంక్రమిత వ్యాధులను ముందే గుర్తించాలి

సిరిసిల్ల: అసంక్రమిత (ఎన్‌సీడీ) వ్యాధులను ముందే గుర్తించి వైద్యం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడినట్లు అవుతుందని ఎన్‌సీడీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్యేంద్రనాథ్‌ అన్నారు. గురువారం డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో జిల్లాలోని పీహెచ్‌సీ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులకు శిక్షణ ఇచ్చారు. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌.రజిత మాట్లాడుతూ, 30 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు రక్త, క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహించి వైద్యసేవలు అందించాన్నారు. కార్యక్రమంలో పీఓఎంహెచ్‌ఎన్‌ డాక్టర్‌ అంజలి ఆల్ఫ్రెడ్‌, డాక్టర్‌ రామకృష్ణ, పీఓఎన్‌సీడీ సంపత్‌కుమార్‌, డీఐవో డాక్టర్‌ అనిత, డాక్టర్‌ నహిమా జహా, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

సమ్మర్‌క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలి

వేములవాడరూరల్‌: విద్యార్థులు సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో జనార్దన్‌రావు అన్నారు. వేములవాడరూరల్‌ మండలం మర్రిపల్లి కేజీబీవీలో సమ్మర్‌ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. 6 తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థులకు జిల్లాలోని కేజీబీవీల్లో ఈ నెల 8 నుంచి 22 వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరాల నిర్వహణకు సమగ్ర శిక్ష అధికారులు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. మొదటి విభా గం ఫైన్‌ ఆర్ట్స్‌లో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, కంప్యూటర్స్‌, స్కిల్‌ బేసిక్‌ కోడింగ్‌, రెండో విభా గమైన అకాడమిక్‌ ఎన్‌రిచ్‌మెంట్‌లో స్పీడ్‌ మ్యాచ్‌, యోగా, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వివిధ రకాల ఆటలు నేర్పిస్తారని వెల్లడించారు. వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్యాంశేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్‌ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఈవో లోకిని కిషన్‌, కేజీబీవీ ప్రత్యేక అధికారి బి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన   రెడ్‌క్రాస్‌ సభ్యులు
1
1/2

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ సభ్యులు

గవర్నర్‌ను కలిసిన   రెడ్‌క్రాస్‌ సభ్యులు
2
2/2

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement