
అప్రమత్తతే ఆయుధం
● జిల్లాలో కరోనా కేసుల్లేవు ● డెంగీ జ్వరానికి సర్కారు వైద్యమే బెస్ట్ ● వ్యాధులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి ● ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్లటౌన్: జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదు.. కరోనా, డెంగీ వ్యాధులకు భయపడకుండా అప్రమత్తత.. బాధ్యతతో ఉంటే నివారించవచ్చని డీఎంహెచ్‌వో రజిత పేర్కొన్నారు. జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు శుక్రవారం ‘సాక్షి’ జిల్లా వైద్యాధికారితో ఫోన్‌ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జ్వరాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు. జూలైలో వచ్చే సీజనల్ వ్యాధులు ఇప్పుడే విస్తరిస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ యువత సహకరిస్తే.. వైద్యారోగ్యశాఖ తరఫున ప్రజల్లో సీజనల్ వ్యాధులపై చైతన్యం కల్పిస్తామని తెలిపారు.

అప్రమత్తతే ఆయుధం