
సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
వీర్నపల్లి(సిరిసిల్ల): పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. వీర్నపల్లి మండలంలో శుక్రవారం రెండో విడతలో మంజూరైన 259 మందికి ఇందిరమ్మ పత్రాలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ 400 నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశల్లో బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. బిల్లులు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్‌లో తెలపాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. నెల రోజుల్లోగా ఇళ్ల పనులు మొదలుపెట్టాలని సూచించారు. పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేకాధికారి రామదాసు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రాములు, ఎంపీడీవో అబ్దుల్ వాజిద్, తహసీల్దార్ మక్తర్ పాషా, ఆర్‌ఐ శివకుమార్ పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): వచ్చే దసరా, దీపావళి పండుగలను ఇందిరమ్మ ఇళ్లల్లో చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. గంభీరావుపేట మండలంలో రెండో విడత కింద 507 మందికి మంజూరైన ఇళ్ల ఉత్తర్వులను శుక్రవారం కేకే మహేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, మండల ప్రత్యేకాధికారి హన్మంతు, ఏఎంసీ చైర్‌పర్సన్ విజయ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు హమీద్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, ఎంపీడీవో రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
బిల్లుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయండి
వీర్నపల్లి, గంభీరావుపేటల్లో ఇళ్ల మంజూరుపత్రాలు పంపిణీ