
పదోన్నతులతో బాధ్యత పెంపు
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి
సిరిసిల్లక్రైం: ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్(సిరిసిల్లటౌన్), లక్పతి(వేములవాడరూరల్), మోతీరాం(బోయినపల్లి)లకు ఎస్సైలుగా పదోన్నతి పొందారు. వీరికి ఎస్పీ అభినందనలు తెలిపారు. పదోన్నతులు పొందిన పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో సేవలందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు.
నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా
రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా ఉండేందుకు గట్టి నిఘా పెట్టామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, సరఫరా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఘనంగా సంతు సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ
రుద్రంగి(వేములవాడ): గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీజగదాంబమాత, శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మానాల ఉద్యమ కాలం నుంచి తన వెంట నడిచిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మానాల, గిరిజన తండా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీపీ గంగం స్వరూపారాణి, నాయకులు గంగం మహేశ్ తదితరులు ఉన్నారు.
కంచర్లలో వైద్యశిబిరం తనిఖీ
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్లలో కొనసాగుతున్న ఉచిత వైద్యశిబిరంను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత శుక్రవారం సందర్శించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి సారి యా అంజుమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అనుమానిత జ్వరపీడితులకు పరీక్షలు చేశారు. ఈ వైద్యశిబిరంలో శుక్రవారం 10 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి ముగ్గురిక రక్తనమూనాలు సేకరించి ఆర్‌డీటీ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. సూపర్‌వైజర్ లింగం, మోహన్ పాల్గొన్నారు.
కూలిన గుడి పరిశీలన
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకలో గురువారం వర్షాలకు శ్రీనరసింహస్వామి ఆలయం గోపురం కూలిపోగా శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు పరిశీలించారు. జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వాహకవర్గ అధికారి మారుతీరావు గుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.40లక్షలు మంజూరు చేస్తే గుడి అభివృద్ధి చేస్తామని గ్రామ కాంగ్రెస్ నాయకుడు మల్లేశం పేర్కొన్నారు. దేవాదాయశాఖ అధికారి మారుతీరావు, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, మండల మండల రెవెన్యూ కార్యాలయం ఆర్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనాలి
సిరిసిల్లటౌన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ పాల్గొన్నారు.

పదోన్నతులతో బాధ్యత పెంపు

పదోన్నతులతో బాధ్యత పెంపు

పదోన్నతులతో బాధ్యత పెంపు