మెడికల్ కాలేజీకి భౌతికకాయం
సిరిసిల్ల: జిల్లా మెడికల్ కాలేజీలో అంతర్‌నిర్మాణ శాస్త్ర బోధనకు అవసరమైన మానవ శవాన్ని వేములవాడ పోలీసులు శుక్రవారం అందించారు. వేములవాడ గుడి చెరువులో లభించిన గుర్తుతెలియని శవాన్ని పట్టణ సీఐ వీరప్రసాద్ సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అందించారు. వివిధ విభాగాధిపతులు డాక్టర్ నిర్విశా, డాక్టర్ అన్వర్ ఉన్నీసా, డాక్టర్ అర్పిత ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవిష్యత్‌లో అనాథ భౌతికదేహాలు ఎక్కడ దొరికినా మెడికల్ కాలేజీకి అందించాలని కోరారు. వివరాలకు 80086 21371లో సంప్రదించాలని తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం
సిరిసిల్ల: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం విత్తన, ఎరువుల వ్యాపారులకు, వ్యవసాయశాఖ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ విత్తన విక్రయాలకు సంబంధించిన లైసెన్స్ కాలపరిమితి, గోదాం, దుకాణం ఇంటి నంబర్లు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. పరిశీలించాలన్నారు. ప్రతీ విత్తనానికి ఇన్వాయిస్ కాపీ, ప్రిన్సిపల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. బిల్లులో రైతు పేరు, లాట్ నంబర్, డీలర్ సంతకం, రైతు సంతకాలు ఉండాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయించొద్దని వ్యాపారులకు సూచించారు.
మెడికల్ కాలేజీకి భౌతికకాయం


