నేటి నుంచి ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రజావాణి

Dec 29 2025 9:14 AM | Updated on Dec 29 2025 9:14 AM

నేటి

నేటి నుంచి ప్రజావాణి

నేటి నుంచి ప్రజావాణి ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ గొర్లమందపై చిరుత దాడి టీచర్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం జీవో 121 రద్దు చేయాలి

● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: ప్రజల సమస్యల పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణిని సోమవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మరిమడ్లలో గొర్లమందపై ఆదివారం చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన గొర్లకాపరులు గొర్లను మానాల శివారులోని అటవీ ప్రాంతంలోకి మేతకు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న చిరుత గొర్లమందపై దాడి చేయగా.. ఒక మేక తీవ్రంగా గాయపడింది. గొర్లకాపరులు కేకలు వేయడంతో మరో మందలోంచి ఓ మేకను ఎత్తుకెళ్లింది. ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి అయిఫ్‌ఖాన్‌ మాట్లాడుతూ మరిమడ్లలో గొర్లమందపై దాడిచేసింది చిరుతనే అన్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లే కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజుల క్రితం గొల్లపల్లి(వట్టిమల్ల)లో కనిపించిన చిరుతపుల్లి మళ్లీ మరిమడ్ల అటవీ ప్రాంతంలో కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వేములవాడ: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు రుద్ర వేణు ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. ఆయన కుటుంబానికి పీఆర్‌టీయూ సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష చెక్కును ఆ శాఖ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి ఆదివారం అందజేశారు. వేణు సతీమణి రుద్ర బాలకు చెక్కును అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు రాజాగౌడ్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు మహేశ్‌, వేములవాడ అర్బన్‌, రూరల్‌ అధ్యక్షులు కిరణ్‌కుమార్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: దేవాదాయశాఖలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని అర్చక ఉద్యోగుల మలిదశ జీఐఏ సాధన సమితి ప్రతినిధులు కోరారు. ఈమేరకు ఆదివారం సిరిసిల్లకు వచ్చిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. జీవో నంబరు 121ను రద్దు చేసి జీవో నంబరు 577ను అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కేటీఆర్‌కు లేఖను రాసి బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు అందజేశారు. సమితి ప్రధాన కార్యదర్శి జయవర్ధనాచార్యులు, రమేశ్‌ పాల్గొన్నారు.

వలసకార్మికుల హక్కులు పరిరక్షించాలి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): గల్ఫ్‌కార్మికుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషిచేయాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు గల్ఫ్‌ జేఏసీ నాయకుడు తోట ధర్మేందర్‌ తెలిపారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వెంకటేశ్‌కు ఆదివారం వినతిపత్రాలు అందించారు. ధర్మేందర్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ కార్మికులు, ఉద్యోగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. విదేశాల్లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహరం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

నేటి నుంచి ప్రజావాణి
1
1/4

నేటి నుంచి ప్రజావాణి

నేటి నుంచి ప్రజావాణి
2
2/4

నేటి నుంచి ప్రజావాణి

నేటి నుంచి ప్రజావాణి
3
3/4

నేటి నుంచి ప్రజావాణి

నేటి నుంచి ప్రజావాణి
4
4/4

నేటి నుంచి ప్రజావాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement