భగీరథ మహర్షికి నివాళి | - | Sakshi
Sakshi News home page

భగీరథ మహర్షికి నివాళి

May 5 2025 8:52 AM | Updated on May 5 2025 8:52 AM

భగీరథ

భగీరథ మహర్షికి నివాళి

సిరిసిల్ల: భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా నివాళి అర్పించారు. కలెక్టరేట్‌లో ఆదివారం బీసీ సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి జరి గింది. మహర్షి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి, పూలమాలలు వేశారు. బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజమనోహర్‌రావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

బలోపేతమవుతున్న ప్రభుత్వ బడులు

మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లోని పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గాలిపల్లిలో ఉపాధి హామీ కింద రూ.20లక్షలతో చేపట్టే సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు గుర్రం సందీప్‌రెడ్డి, డీఈ సత్యనారా యణ, ఏఈ నాగరాజు, ఎంఈవో శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు వెంకటరమణారెడ్డి, పాశం రాజేందర్‌రెడ్డి, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

అబద్దాలతో మోసం చేయలేరు

కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌

సిరిసిల్లటౌన్‌: అబద్దాలతో ప్రజల మనస్సులను బీజేపీ నేతలు గెలువలేరని కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 85,485 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కానీ బీజేపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు దొందూ దొందేనని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న మంచి పథకాలపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్‌, గడ్డం కిరణ్‌, అన్నల్‌దాస్‌ భాను, వంతడ్పుల రాము, అడ్డగట్ల శంకర్‌, మేకర్తి నారాయణ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ముస్తాబాద్‌ మండలం బందనకల్‌లో ఆదివారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దే పనిలో ఉందన్నారు. దేశభద్రత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. పదకొండేళ్లుగా అత్యంత సురక్షిత దేశంగా భారత్‌ ఎదిగిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, నాయకులు కస్తూరి మహిపాల్‌రెడ్డి, కరెడ్ల రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, కల్యాణ్‌, మహేశ్‌, కార్తీక్‌రెడ్డి, శ్రీకర్‌రెడ్డి, గోపి తదితరులు ఉన్నారు.

భగీరథ మహర్షికి నివాళి1
1/3

భగీరథ మహర్షికి నివాళి

భగీరథ మహర్షికి నివాళి2
2/3

భగీరథ మహర్షికి నివాళి

భగీరథ మహర్షికి నివాళి3
3/3

భగీరథ మహర్షికి నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement