
‘అనర్హులకు ఉద్యోగాలు’
సిరిసిల్లటౌన్: అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసి భంగపడిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ శనివారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ల్యాబ్ అటెండెన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఈసీజీ థియేటర్ అసిస్టెంట్స్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ల్యాబ్ అటెండెన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర పోస్టులకు అర్హత లేని వారికి మార్కులు కలిపి ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయమైన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్, సంతోష్, కిరణ్, ప్రశాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.