
ఉపాధ్యాయుల సహకారంతోనే..
మా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు బాగా చదవాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఉదయమే ఫోన్‌చేసి చదువుకునేలా చేశారు. వెనుకబడ్డ సబ్జెక్టులపై తరగతులు నిర్వహించారు. పరీక్షలంటే భయం పోగొట్టారు. మనం ప్రైవేటుకు ఏ మాత్రం తక్కువ కాదనే నమ్మకాన్ని కల్పించారు.
– సానియా, కొండాపూర్
వెనుకబడిన విద్యార్థుల దత్తత
చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. ప్రతీ ఆరుగురి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాం. స్టడీ అవర్స్‌తోపాటు ఇంటి వద్ద పిల్లలు చదివేలా చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాం. ప్రతి పాఠంపై స్లిప్ టెస్టు పెట్టాం.
– నర్సింహరాజు, ప్రిన్సిపాల్, మోడల్‌స్కూల్

ఉపాధ్యాయుల సహకారంతోనే..