
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.
మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది.