
ట్యాంకర్ కిందపడి సూపర్‌వైజర్ మృతి
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీలో తాను నడుపుతున్న ట్యాంకర్ కిందపడి పీసీపటేల్ అనే ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు సూపర్‌వైజర్ మృతి చెందాడు. సోమవారం రెండో షిప్టులో వికాస్‌కుమార్(35) అనే సూపర్‌వైజర్ ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యాడు. హాలేజీ రోడ్డులో దుమ్ములేవకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు చల్లేందుకు వాహనం నడుపుకుంటూ వెళ్లాడు. ఈక్రమంలో ట్యాంకర్ అదుపు తప్పింది. అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నంలో అదుపుతప్పి అదేట్యాంకర్ వెనుక టైర్ కింద పడి వికాస్‌కుమార్ దుర్మరణం చెందాడు. డ్రైవర్ నడపాల్సిన ట్యాంకర్‌ను సూపర్‌వైజర్ ఎందుకు నడపాల్సి వచ్చిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాలంచెల్లిన వాహనంతో పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి రూ.కోటిపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
న్యాయం జరిగేంత వరకు శవాన్ని కదలనివ్వం
ప్రమాదంపై విచారణ జరిపి, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు శవాన్ని ఇక్కడ నుంచి తీయనివ్వమని కార్మిక సంఘాల నాయకులు యాదగిరి సత్తయ్య, మడ్డి ఎల్లాగౌడ్ డిమాండ్‌చేశారు. పీసీపటేల్ ప్రైవేట్ ఓబీ సంస్థ నిర్లక్ష్యంతోనే వికాస్‌కుమార్ మృతి చెందాడని ఆరోపించారు.
రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్