
చట్టాలపై అవగాహన అవసరం
● డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక జైస్వాల్
సిరిసిల్లటౌన్: చట్టాలపై పౌరులకు అవగాహన ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు(నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం, 2013 న్యాయ సేవల చట్టంపై అవగాహన కల్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీనివాస్, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, అడిషనల్ కమాండెంట్ డీఎస్పీ సీహెచ్ సాంబశివరావు పాల్గొన్నారు.
గోరక్షణ చట్టాలు అమలు చేయాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో గోరక్షణ చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని దేశీ గోవంశ రక్షణ సవర్థన సమితి ప్రతినిధి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. సోమవారం సమితి ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. చట్ట విరుద్ధంగా ఉంటున్న గోవధ శాలలను వెంటనే మూసివేయాలని, ఆక్రమణలో ఉన్న గోచర భూములకు వి ముక్తి కల్పించాలని, గుర్తింపు గల గోశాలల కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ముష్కు సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రేరణ ఆదర్శం
● కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ఆదర్శనీయమని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మేడి సురేశ్ ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పేదరికంలో పుట్టి పెరిగిన సురేశ్ ప్రేరణ సంస్థను స్థాపించి పదేళ్లుగా సేవ చేయడం అభినందనీయమన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి కొండం రాజిరెడ్డి, సడిమెల బాలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్‌రావు, ఎల్లాగౌడ్, శరత్, మల్లేశ్, వెంకటయ్య, తిరుపతి, పర్శరాములు, రాజు, మోహన్ పాల్గొన్నారు.
బుద్ధుని బోధనలు అనుసరణీయం
● బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనరసింహరావు
చందుర్తి(వేములవాడ): విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసా మార్గాన్ని చూపిన గౌతమ బుద్ధుని బోధనలు యువతకు మార్గదర్శకమని బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. మండలంలోని లింగంపేటలో చార్వాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బుద్ధపౌర్ణమి వేడుకలకు హాజరై మాట్లాడారు. శాంతిని వెతికే ప్రతీ మనిషి బుద్ధుని మార్గంలో నడవాలన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించి, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుతూ జీవనం సాగించాలనే బుద్ధుని బోధనలు అనుసరణీయమన్నారు. చార్వాక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దప్పుల అశోక్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, నాయకులు ఇస్మాయిల్, చార్వాక వృద్ధుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం