సీఎం రేవంత్‌ చేతులెత్తేశారా?.. బండి సంజయ్‌ కౌంటర్‌ | Bandi Sanjay Counter To CM Revanth Reddy Comments | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ చేతులెత్తేశారా?.. బండి సంజయ్‌ కౌంటర్‌

May 6 2025 11:42 AM | Updated on May 6 2025 12:38 PM

Bandi Sanjay Counter To CM Revanth Reddy Comments

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్‌ రాసిచ్చారు. రేవంత్‌ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్‌ మండిపడ్డారు.

మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు.

..కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు...  తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement